అంతర్జాతీయం

బస్సు బోల్తా: 29 మంది మృతి

లిస్బన్‌: పోర్చుగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సుబోల్తా పడి 29 మంది మృతిచెందారు. ఈ ఘటన పోర్చుగీసు ద్వీపమైన మడైరాలో చోటుచేసుకుంది. మృతిచెందిన వారంతా జర్మనీ దేశానికి చెందినవారిగా సమాచారం. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నారు.