క్రీడలు

బంగ్లాదేశ్‌ ముందు భారీ లక్ష్యం

ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ అదరగొట్టారు. బంగ్లా బౌలర్లు ధాటిగా ఎదుర్కొంటూ అద్భుత ప్రదర్శన చేశారు. కానీ, కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోడంతో భారీ స్కోరు చేసే అవకాశం చేజేతులా కోల్పోయారు. మరోవైపు చివర్లో బంగ్లా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. సైపుద్దీన్‌(3/72), ముస్తాఫిజుర్‌(3/59), షకిబ్‌(2/54) ధాటికి విండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 321 పరుగులు చేసింది. షై హోప్‌(96; 121బంతుల్లో 4×4, 1×6), లూయిస్‌(70; 67బంతుల్లో 6×4, 2×6), హెట్‌మయిర్‌(50; 26బంతుల్లో 4×4, 3×6) అర్థశతకాలతో మెరిపించి కీలక ఇన్నింగ్స్‌ ఆడారు.