weather Reportజాతీయం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

తూర్పు మధ్య బంగాళాఖాతంలో వున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఛత్తీస్‌ఘడ్‌, ఒడిశా తీరానికి ఆనుకుని ఉంది. ఇది వాయువ్య దిశగా పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్‌ఘఢ్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ఇక ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు చోట్ల కోస్తా, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కోస్తా తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అందువల్ల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.