జాతీయం

ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలి: వెంకయ్య

హైదరాబాద్‌: ఫోన్లు, టీవీలకు అంటుకుపోయే సంస్కృతికి దూరంగా ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవు పలికారు. శారీరక శ్రమ మన జీవన శైలికి అత్యంత అవసరమని సూచించారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌- కేర్‌ హాస్పిటల్స్‌ సంయుక్తంగా శనివారం శంషాబాద్‌ పరిధి ముచ్చింతల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఉత్సాహాన్నిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాలకూ వైద్య సేవలు విస్తరించాలని ఆకాంక్షించారు.