ఆంధ్రప్రదేశ్

ఫలించని శిల్పా ప్రయత్నాలు.. జగన్ అనుకున్నట్టుగానే..

కర్నూలు: నంద్యాల ఎంపీ వైసీపీ టికెట్‌ ఇటీవల బీజేపీ నుంచి వైసీపీలో చేరిన పోచా బ్రహ్మానందరెడ్డికి ఖరారైంది. అయితే.. మొదటి నుంచి మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి తన కొడుకును ఎమ్మెల్యేగా పోటీ చేయించి తాను ఎంపీగా పోటీ చేయాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. జగన్‌ ససేమిరా అన్నట్లు తెలిసింది. అయినా కడప పెద్దలతో శిల్పా చివరి వరకూ ప్రయత్నాలు సాగించారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. జగన్ తాను అనుకున్నట్టుగానే పోచాకు ఎంపీ టికెట్‌ ఇవ్వడంతో శిల్పా వర్గం అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం. పోచాకు టికెట్ ఇవ్వడం శిల్పా వర్గానికి ఇష్టం లేదని తెలుస్తోంది.