అంతర్జాతీయం

ప్రైవసీ విలాస వస్తువు కాదు: సుందర్‌ పిచాయ్‌

న్యూయార్క్‌: గోప్యత అనేది విలాస వస్తువు కాదని అది కేవలం ఖరీదైన వస్తువులు, సేవలు పొందగలిగిన సామర్థ్యం ఉన్న ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌కు రాసిన వ్యాసంలో గూగుల్‌ పాలసీలను ఆయన బలంగా సమర్థించారు. గూగుల్‌ తన వినియోగదారుల ప్రైవసీని, డేటాను అవసరాలకు అనుగుణంగా వాడుకుంటోందని వస్తున్న ఆరోపణలను ఖండించారు. ‘ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ప్రైవసీ అనేది సమానంగా ఉంటుంది. ఈ విషయంలో గూగుల్‌ ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. తమ సమాచారం వినియోగం, ఇతరులతో పంచుకోవడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రైవసీ అనే దానికి ఎవరి ధోరణిలో వాళ్లు కొత్త అర్థాలు చెబుతున్నారు. ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు వ్యక్తులతో నేను మాట్లాడా. ప్రజల ప్రైవసీ రక్షణ కోసం చట్టాలు ఎంతగానో ఉపకరిస్తాయి’’ అని పేర్కొన్నారు.