క్రైమ్జాతీయం

ప్రేమించడమే పాపమా కులం పేరుతో కూతుర్ని ..

నవాడా(బిహార్): ప్రేమించడమే పాపమా. మరో కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించడమే ఈ అమ్మాయి చేసిన నేరమా? ప్రేమించిన వ్యక్తితో కలిసి పారిపోయి తమ పరువు తీసిందనే ఆగ్రహంతో బిడ్డపై తల్లిదండ్రులు కక్షసాధింపు చర్యకు పాల్పడ్డారు. పారిపోయిన బిడ్డను వెతికి పట్టుకొని నమ్మించి ఇంటికి తీసుకొచ్చి దారుణంగా ప్రవర్తించారు. గ్రామం నడిబొడ్డున చెట్టుకు కట్టేసి పంచాయతీ పెట్టి కన్నబిడ్డను చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన సెప్టెంబర్ 30న బిహార్‌లోని నవాడాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఊరు, కులం కట్టుబాట్లుకు వ్యతిరేకంగా మరో కులం వ్యక్తిని ప్రేమించడం, ఆపై అతనితో కలిసి పారిపోవడంపై గ్రామ పంచాయతీ పెద్దలు శిక్ష పేరుతో యువతిని చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశారు. ఆ చిత్రహింసలను తాళలేక యువతి స్పృహ తప్పి కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని స్పృహ కోల్పోయిన యువతిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఎందుకు ఇలా యువతిని చావబాదారని పోలీసులు ప్రశ్నించగా.. యువతి తండ్రి మాట్లాడుతూ..‘‘మా ఊళ్లో మరో కులం వ్యక్తిని ప్రేమించిన నా కుమార్తె అతడితో పారిపోయింది. అందుకే గ్రామ పంచాయతీలో చెట్టుకు కట్టేసి శిక్ష వేయించాం’’ అని చెప్పడం గమనార్హం.