తెలంగాణ

ప్రముఖ నటుడు దేవదాస్ కన్నుమూత

హైదరాబాద్ : ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దేవదాస్ కనకాల తనయుడు రాజీవ్ కనకాల టాలీవుడ్ లో పేరున్న నటుడు కాగా, ఆయన కోడలు సుమ అగ్రశ్రేణి యాంకర్ గా పేరుతెచ్చుకున్నారు. 1945 యానాంలో జన్మించిన దేవదాస్ కనకాల నటుడిగానే కాకుండా, నటనా శిక్షకుడిగా సైతం ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తన అర్ధాంగితో కలిసి యాక్టింగ్ ఇన్ స్టిట్యూట్ పెట్టి అనేకమందిని చిత్ర పరిశ్రమకు అందించారు. నటుడిగా సిరిసిరిమువ్వ, గోరింటాకు, మంచుపల్లకి వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన చివరగా నటించిన చిత్రం భరత్ అనే నేను.