సినిమా

ప్రముఖ నటుడు కెప్టెన్‌ రాజు కన్నుమూత..

నటుడు, డైరెక్టర్ కెప్టెన్‌ రాజు కన్ను మూశారు. ఆయన వయసు 68 ఏళ్లు. సోమవారం ఉదయం కొచ్చిలోని తన ఇంట్లో గుండెపోటుతో ఆయన మరణించారు. సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కేరళకు చెందిన రాజు.. 1981లో వచ్చిన రక్తం మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన రాజు.. దాదాపు మూడుదశాబ్దాలపాటు అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఆయన దాదాపు 500 సినిమాలు చేశారు. వెంకటేశ్‌ నటించిన శత్రువు ఫిల్మ్‌లో విలన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆఖరి చిత్రం 2017లో వచ్చిన ‘మాస్టర్‌పీస్‌’. కొంతకాలం ఆర్మీలోనూ పనిచేయడంతో ఆయన్ని అందరూ ‘కెప్టెన్‌’ అని పిలుస్తుండేవారు.