ఆంధ్రప్రదేశ్క్రైమ్

ప్రమాదం వల్ల ఆలస్యం.. పరీక్షకు అనుమతి..

డోర్నకల్‌: మహబూబాబాద్‌ డోర్నకల్‌ మండలం చాప్లా తండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ఆటో బోల్తా పడి ముగ్గురు పదో తరగతి విద్యార్థులకు గాయాలయ్యాయి. మానస, రాకేశ్‌, నవీన్‌ అనే విద్యార్థులకు గాయాలు కావడంతో వెంటనే సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనివల్ల పరీక్షకు ఆలస్యమైంది. ప్రమాదం దృష్ట్యా ఈ విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వచ్చినా అనుమతించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ఆదేశించారు. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకున్న విద్యార్థులు అనంతరం పరీక్షా కేంద్రానికి వెళ్లారు.