తెలంగాణ

ప్రగతిభవన్‌ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం

తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్ ఎదుట దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది దీన్ని గమనించి వారిని అడ్డుకున్నారు. అనంతరం దంపతులను పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఇబ్రహీంపట్నానికి చెందిన మల్లేశ్‌ దంపతులు తమ భూమి విషయంలో న్యాయం జరగడంలేదనే ఆవేదనతో ఇవాళ క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చారు. తమ వెంట తీసుకొచ్చిన కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునే క్రమంలో అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. సీఎం కార్యాలయ భద్రతా సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు దంపతులను ఠాణాకు తరలించారు.