తెలంగాణ

ప్యాసింజర్‌ రైళ్ల రద్దుకాలం పొడిగింపు

కాజీపేట: దక్షిణ మధ్య రైల్వేలో వివిధ ఇంజినీరింగ్‌ పనుల కారణంగా ప్రకటించిన ప్యాసింజర్ల రద్దు కాలాన్ని మరింత పొడిగించారు. ఆ మేరకు రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మణుగూరు-కాజీపేట మధ్య నడిచే 57657/58 నంబరు మణుగురు ప్యాసింజరు రైళ్లను 9వ తేదీ నుంచి నెలాఖరు వరకు రద్దుచేస్తున్నారు. 67245/46 నంబరు విజయవాడ-భద్రాచలం రోడ్‌ ప్యాసింజర్‌ రైలుబండ్లు కూడా 9 నుంచి 30వ తేదీ వరకు రద్దవుతున్నాయి. వీటిని డోర్నకల్‌-భద్రాచలం రోడ్‌ వరకు రద్దుచేస్తున్నారు. అంటే విజయవాడ-డోర్నకల్‌ మధ్య మాత్రమే నడుస్తాయి.ఈ రైళ్లు  9వ తేదీ నుంచి పునఃప్రారంభం కావాల్సి ఉండగా, మరింతకాలం పొడిగించారు.