జాతీయం

పోలింగ్‌ తీరుపై సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

దిల్లీ :  ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఈసీకి ఫిర్యాదు చేశారు. దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు సీఈసీ సునీల్‌ అరోడాను కలిశారు. రాష్ట్రంలో పోలింగ్‌ జరిగిన తీరు, ఈవీఎంల లోపాలపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు సహా 20 మంది సభ్యుల బృందం ఈసీని కలిసింది. సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ, మాల్యాద్రి శ్రీరాం, యనమల, కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, తోట సీతారామ లక్ష్మీ, మాగంటి బాబు, మురళీమోహన్, గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, కనకమేడల రవీంద్ర కుమార్, కంభంపాటి రామమోహనరావు తదితరులు ఈసీని కలిసిన వారిలో ఉన్నారు. ఈసీ తీరు, ఈవీఎంల లోపాలపై జాతీయ స్థాయిలో ఉద్యమించాలని చంద్రబాబు నిర్ణయించారు.