ఆంధ్రప్రదేశ్

పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారణం!

అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాజమండ్రి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్‌కు కావాల్సిన అనుమతులను వైఎస్‌ఆర్‌ తీసుకొచ్చారని తెలిపారు. పోలవరానికి శంకుస్థాపన చేసి కార్యరూపం తీసుకొచ్చింది వైఎస్‌ఆరే. మహానేత ఉండి ఉంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేది. పోలవరాన్ని పూర్తిచేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక రెండేళ్ల సమయాన్ని బాబు వృథా చేశారు. కాంట్రాక్టులు, కమీషన్ల కోసం రెండేళ్లపాటు బాబు కాలయాపన చేశారు. పోలవరంలో ప్రతిచిన్న పనికి అట్టహాసంతో ప్రజలను మభ్యపెట్టారు. గ్రావిటితో నీళ్లు ఇవ్వడం అసాధ్యమని బాబు ఇప్పుడు చెప్తున్నారు. దోచుకునేందుకు పోలవరం అంచనా వ్యయాన్ని పెంచేశారు. కాసుల కక్కుర్తి కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారణం. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో పోలవరం పూర్తి చేస్తాం. ఇకనైనా చంద్రబాబు జిమ్మిక్కులు, మోసాలు ఆపాలని బొత్స సూచించారు.