జాతీయం

పెట్రోల్, డీజిల్ ధరల పై బీజేపీకి రాందేవ్ హెచ్చరిక..

బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు యోగా గురు బాబారాందేవ్. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. రోజురోజుకీ పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడికి పెనుభారంగా మారిందన్నారు. తానే ప్రభుత్వంలో వుంటే పెట్రోలు, డీజిల్‌ను లీటర్ 35-40 రూపాయలకే ఇచ్చేవాడినన్నారు. ఓ టీవీ చానల్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తారా? అని ప్రశ్నకు.. తానేనెందుకు ఆ పార్టీకి ప్రచారం చేస్తానని ఎదురు ప్రశ్నించారు. తనంతట తానే రాజకీయాలకు దూరంగా వున్నానని, తాను ఏపార్టీతోనూ లేను.. అన్ని పార్టీలతోనూ కలిసి వుంటానని రిప్లై ఇచ్చేశారు. చాలామంది ప్రజలు మోదీని విమర్శిస్తున్నారని, కానీ స్వచ్ఛ‌భారత్‌ వంటి మంచి కార్యక్రమాలను మోదీ ప్రారంభించారని గుర్తుచేశారు.