Uncategorized

పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను రేటును ఒకేలా విధించాలని ..

దేశంలో ఇంధన ధరలు రోజు రోజుకు పెరుగుతుండటం, సామాన్యుడిని కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.90 మార్కును దాటింది. మరో పది రోజులు పోతే ఇదికాస్త రూ. 100 అయ్యే అవకాశం ఉందని ఆందోళన సామాన్యులు వ్యక్తం చేస్తున్నారు. అయితే మిగతా రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, చండీగఢ్‌లలో పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను రేటును ఒకేలా విధించాలని నిర్ణయించారు. ఈ రాష్ట్రాలన్నీ ఏకరీతి పన్నును విధించాలని అంగీకారానికి వచ్చాయి. పెట్రోలియం ఉత్పత్తుల పన్ను రేట్లపై ఈ ఐదు రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు చర్చలు జరిపారు. ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌పై ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యాట్‌ రేటు ఉంటుంది. ఇలా కాకుండా ఏకరీతి పన్నును విధించాలని నిర్ణయించారు. ఇంధన ధరలతో పాటు మద్యం, వాహనాల రిజిస్ట్రేషన్‌, రవాణా పర్మిట్‌పై కూడా ఏకరీతి పన్ను విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించాయి. ఇది జరిగితే పంజాబ్‌, హరియాణా, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌, చండీగఢ్‌లలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఒకేలా ఉంటాయి.