అంతర్జాతీయంజాతీయం

పెట్రోలు, డీజిలుపైరూ.1.50పెరుగుదల

కేంద్ర బడ్జెట్లో పెట్రోలు, డీజిలుపై ధరలు లీటరుకు రూ. 1 చొప్పున పెంచింది. రాష్ట్ర ప్రభుత్వ సుంకం, బంకు ఉన్న దూరం ఆధారంగా దీనిపై అదనపు మొత్తం పడుతుంది. ఇవన్నీ కలుపుకుని సుమారు రూ. 1.30 నుంచి రూ.1.50 వరకు పెరిగే అవకాశం ఉంది.

జిల్లా వ్యాప్తంగా 250 బంకులు, నగరంలో సుమారు 100 బంకులు ఉన్నాయి. ● ప్రస్తుతం రోజువారీగా పెట్రో, డీజిలు ధరలు మారుతున్నాయి. వీటితో సంబంధం లేకుండా తాజా పెంపు అదనంగా పడుతుంది. శుక్రవారం నగరంలో పెట్రోలు లీటరు ధర రూ. 73.78. డీజిల్‌ ధర రూ. 68.61గా ఉంది. ● తాజా పెంపు శనివారం తెల్లవారుజామున అమల్లోకి రానుందని పెట్రోలు డీలర్ల సంఘం ప్రతినిధి దినకర్‌ తెలిపారు. ● నగరంలో పెట్రోలు, డీజిలు కలిపి రోజుకు 7 లక్షల లీటర్ల వరకూ అమ్ముడవుతోంది