Uncategorized

పుణ్యస్నానాల కోసం కాదు..

మహబూబాబాద్‌: కురవి మండలం నేరడ పెద్ద చెరువులో గురువారం ఉదయం ప్రజలు చేపల వేటకు దిగారు. గ్రామశివారులో ఉన్న చెరువులో నీరు అడుగంటిపోవడంతో నేరడ గ్రామంతో పాటు, ఇతర మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకున్నారు. వలలతో చెరువులోని గుంతల్లో ఉన్న నీటిలోకి దిగారు. మగవారితో పాటు మహిళలు సైతం వలలు, చీరలు చేతపట్టి చేపల వేటకు దిగారు. వలలు, చీరలకు చిక్కిన చేపలను పట్టుకున్నారు. చెరువులో పెద్ద ఎత్తున చేపల వేటకు దిగిన వారితో చెరువులోఎటు చూసినా జనసందోహం నెలకొంది. చెరువు కట్టపై నుంచి వెళ్లే వారు చేపల కోసం వచ్చిన వారిని చూసి ఆశ్చర్యపోయారు.