అంతర్జాతీయం

పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ విభాగంలో వాటాల విక్రయం

ముంబయి: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తన హౌసింగ్‌ ఫైనాన్స్‌ విభాగంలోని వాటాలను విక్రయించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వాటాలను జనరల్‌ అట్లాంటిక్‌ గ్రూప్‌, వార్దె పార్టనర్స్‌కు రూ.1,851.60 కోట్లకు విక్రయించనుంది. ఈ డీల్‌ తర్వాత పీఎన్‌బీకి హౌసింగ్‌ ఫైనాన్స్‌ విభాగంలో 19.78శాతం వాటా మిగిలి ఉంటుంది. దీంతో ప్రమోటర్‌గా, వ్యూహాత్మక భాగస్వామిగా కొనసాగుతుంది. ఈ విషయాన్ని పీఎన్‌బీ నిన్న స్టాక్‌ ఎక్స్‌ఛేంజికి తెలియజేసింది. గత ఏడాది డిసెంబర్‌ నాటికి 32.79శాతం వాటా ఉంది.
ఈ డీల్‌లో భాగంగా పీఎన్‌బీ చెరో 10.89 మిలియన్ల షేర్లను జనరల్‌ అట్లాంటిక్‌, వర్దె పార్టనర్స్‌కు రూ.850 ధర వద్ద విక్రయిస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధుల సేకరణకు సంబంధించి వ్యూహంలో ఇది భాగం.