ఆంధ్రప్రదేశ్

పవన్‌తో దోబూచులాడుతున్న ఆధిక్యం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం పాలైంది. చివరికి ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. బరిలోకి దిగిన రెండో స్థానాల్లోనూ ఆదినుంచి జనసేనానిని ఆధిక్యం దోబూచులాడుతోంది. గాజువాకలో 13 రౌండ్లు పూర్తయ్యేసరికి 4,500పై చిలుకు ఓట్ల వెనుకంజలో పవన్‌ ఉన్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. ఇక భీమవరంలో 13 రౌండ్లు ముగిసేసరికి పవన్‌.. 2 వేలకుపైగా ఓట్ల తేడాతో వెనుకబడిపోయారు. మరోవైపు రాష్ట్రంలో జనసేన కేవలం ఒకే ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుండం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజోల్‌ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్‌రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.