తెలంగాణ

పల్లెపహాడ్ లో భూనిర్వాసితులకు చెక్కుల పంపిణీ

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు చెక్కుల పంపిణీ కొనసాగుతున్నది. మల్లన్న సాగర్ ముంపు గ్రామం పల్లెపహాడ్ లో ఇవాళ చెక్కులను పంపిణీ చేశారు. సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు కృష్ణభాస్కర్, వెంకట్రామ్‌రెడ్డి, ఆర్డీవోలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో నిర్వాసితులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పల్లెపహాడ్ గ్రామ భూనిర్వాసితులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి సన్మానం చేశారు.