అంతర్జాతీయంజాతీయం

పగలని గుడ్డు.. జవాన్లకు నో ఫుడ్డు!

ఎముకల కొరికే చలిలో గస్తీ నిర్వహిస్తున్న భారత సైనికలు బుక్కెడు బువ్వ కోసం నానా కష్టాలు పడుతున్నారు. దేశ రక్షణ కోసం ప్రపంచంలోనే అతి ఎత్తైన సైనిక గస్తీ ప్రాంతం సియాచిన్ గ్లేసియర్‌లో మైనస్‌ 40-70 డిగ్రీల చలి మధ్యన ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తున్నారు. ఆ మంచు పర్వతాల్లో శత్రువుల కంటే… మంచుతోనే యుద్ధం చేస్తున్నారు. అక్కడి వాతావరణానికి తాగే నీటితోపాటూ తినే ఏ పదార్థమైనా ఇట్టే గడ్డకట్టిపోతుంటాయి. ఎంతలా అంటే… సుత్తితో పగలగొట్టినా పగలనంత గట్టిగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాము తిండి కోసం పడే తిప్పలు ఎలా ఉంటాయో వివరిస్తూ… ఓ జవాన్ ట్విట్టర్‌లో వీడియోని పోస్ట్ చేశారు. సియాచిన్ గ్లేసియర్‌లో జీవించడం ఎంత కష్టమో.. భారత సైన్యం చేస్తున్న సేవ ఏంటో ఈ వీడియోని చూస్తే అర్థం అవుతోంది.

ఆ వీడియోలో ఏముందంటే..  ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్‌ ఇటుకలా గడ్డకట్టడం దాన్ని సుత్తెతో కొట్టినా పగలలేదు. వేడి చేస్తే తప్పా ఆ జ్యూస్ తాగాలేరు. ఇక దుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు కోడిగుడ్లు, అల్లం… ఇలా అన్నీ రాళ్లలాగా గట్టిగా ఉంటాయి. గడ్లు గట్టిగా కొట్టినా పగలదంటూ ఆ సైనికులు తమ బాధను వివరించారు. గుడ్లు, అల్లం, ఉల్లిపాయలు ఇలా ఏది పగలగొట్టాలన్నా ఓ యుద్ధం చేసినట్లేనని, ఇంత దారుణమైన పరిస్థితుల్లో తాము పహారా కాస్తున్నామని సైనికులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుండగా.. చాలా మంది నెటిజన్లు హ్యాట్సాఫ్‌ చెబుతూ సైనికుల సేవలను కొనియాడుతున్నారు.