జాతీయం

నోయిడాలో కియా తొలి షోరూం

అనంతపురం జిల్లా పెనుకొండలో కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన కియా మోటార్స్‌.. దేశంలో తొలి షోరూంను ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఏర్పాటుచేసింది. అనంతపురం ప్లాంట్‌లో ఏడాదికి 3 లక్షల కార్లను ఉత్పత్తి చేయాలని భావిస్తున్న కియా వీటిని దేశీయ మార్కెట్‌లో విక్రయించేందుకు వీలుగా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొంటోంది. ఇందులో భాగంగా సంస్థకు చెందిన సొంత విక్రయ కేంద్రాన్ని నోయిడాలో ఏర్పాటు చేశారు. ‘రెడ్‌ క్యూబ్‌’ పేరిట ప్రత్యేక థీమ్‌తో దేశవ్యాప్తంగా ఈ షోరూమ్‌లు ఏర్పాటు చేయాలని కియా భావిస్తోంది. జులై తర్వాత తొలి కారును అనంతపురం ప్లాంట్‌ నుంచి రోడ్డుపైకి తీసుకురావాలని కియా నిర్ణయించింది.