సినిమా

”నోటా” సినిమాను ఎన్నికల కమిషన్ చూడాలి – కేతిరెడ్డి డిమాండ్

హైదరాబాద్ , సెప్టెంబర్ 30 : విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ”నోటా” సినిమాను ఎన్నికల కమిషన్ చూసిన తరువాతే తెలంగాణ రాష్ట్రంలో విడుదల చెయ్యాలని సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నోటా చిత్ర ట్రైలర్ లో పేర్కొన్నా విషయాలను బట్టి త్వరలో రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికల్లో ఎదో ఒక పార్టీ కి కొమ్ము కాసి నిర్మించిన చిత్రం గా ఉందని కేతిరెడ్డి అభిప్రాయా పడ్డారు. తెలంగాణ లో జరగబోతున్న ఎన్నికల నేపథ్యంలో ఒక పార్టీకి కొమ్ము కాసి నిర్మించిన ఒక రాజకీయ చిత్రం అని సినిమా వర్గాల ద్వారా తెలిసిందని అన్నారు. “నోటా” అంటే ఎన్నికల్లో ఓటు వేయుటకు ఇష్టం లేని వారి తిరస్కరనగా వేసే ఓటు అని,ఈ చిత్రంలో నోటా ను వేక్కిరించే విధంగా సన్నివేశాలు ఉన్నాయా ? అన్న అనుమానాలు సగటు ప్రేక్షకులకు,రాజకీయ పార్టీల కు కలుగుతుందని ఆరోపించడం . సాధారణంగా చిత్రం రిలీజు తేదీని చిత్రం సెన్సార్ కార్యక్రమం తరువాత ప్రకటించుతారని కానీ నోటా తెలుగు సెన్సార్ కాకముందే రేలీజ్ తేదీని ప్రకటించిన నిర్మాత .డిస్ట్రిబ్యూటర్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. పోలీస్.రెవెన్యూ చూసి చిత్రం లో అభ్యంతర సన్నివేశాలు ఉంటె ఎన్నికల తరువాతే శాంతిభద్రతల దుష్ట సినిమా ను విడుదల చేయాలని కోరారు. గవర్నర్ ,కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘం,కేంద్ర సమాచార శాఖ వెంటనే జోక్యం చేసుకొని ఈ నోటా చిత్రం పై ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు.

గతంలో అర్జున్ రెడ్డి సినిమా తో వివాదాస్పద హీరోగా పేరొందిన విజయ్ దేవరకొండ ఎన్నో వివాదలకు సినిమా లలో కేంద్ర బిందువు అయ్యాడు కాబట్టీ ఈ నోటా సినిమా పోస్టరే ఎన్నికల సంఘం చట్టాలకు ఉల్లంగాన అని ,ఈ పేరే నోటా చట్టవ్యతిరేకమని కెతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు.