ఆంధ్రప్రదేశ్

నేడు సీఎం చంద్రబాబు ప్రకాశంజిల్లా లో పర్యటన….

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ప్రకాశం జిల్లాకు బయలుదేరి వెళ్లారు. జిల్లా పర్యటనలో భాగంగా రామాయపట్నంలో నిర్వహించే జన్మభూమి- మాఊరు కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఆపై రామాయపట్నం పోర్ట్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. తరువాత ఆసియా పల్స్, పేపర్ మిల్ నిర్మాణానికి పైలాన్ ఆవిష్కరణ, శంకుస్థాపన చేయనున్నారు.