Uncategorizedఆంధ్రప్రదేశ్తెలంగాణ

నేడు వినాయక చవితి.. కోలాహలంగా వీధులు.. కిక్కిరిసిన మార్కెట్లు

  • సర్వాంగ సుందరంగా మండపాలు
  • జనాలతో కిక్కిరిసిన మార్కెట్లు
  • గణపయ్య రాక కోసం ఎదురు చూపులు

నేడు భాద్రపద శుద్ధ చవితి.. తల్లిదండ్రులు శివపార్వతులకు నమస్కరించి భూలోకానికి బొజ్జ గణపయ్య బయలుదేరాడు. ఆయన రాకకోసం వేచి చూస్తున్న కోట్లాదిమంది భక్తులు.. ఆహ్వానం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనకు అత్యంత ఇష్టమైన పత్రులు, పండ్లు సేకరిస్తూ బిజీగా మారిపోయారు. మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ కాంతులతో 9 రోజులూ దేదీప్యమానంగా వెలిగేలా ఏర్పాట్లు చేశారు. శుభ ఘడిగ సమీపించగానే విఘ్ననాథుడిని మండపంలో ప్రతిష్ఠించి పూజలు చేసేందుకు దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

మార్కెట్లు, వీధులు కిక్కిరిసిపోయాయి. పార్వతీ తనయుడంటే ఎంతగానో ఇష్టపడే చిన్నారులు గల్లీకి ఒకటి రెండు చిన్నచిన్న మంటపాలు వేసి ఏకదంతుడి పూజకు సిద్ధమవుతున్నారు. తమకు తోచిన రీతిలో గణనాథుడిని పూజించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు, విగ్రహాలు, పండ్లు, పత్రుల కొనుగోలుతో మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. వచ్చేవారు, వెళ్లేవారితో రద్దీగా మారిపోయాయి. ఎక్కడ చూసినా భక్తి వెల్లివిరుస్తోంది. సాయంత్రానికి ఇది మరింత ఉచ్ఛస్థితికి చేరుతుంది. ఏకదంతుడి నామస్మరణతో పల్లెల నుంచి నగరాల వరకు మార్మోగనున్నాయి.

Sneha News Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
Sneha News Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
Latest Posts