జాతీయం

నేడు టీటీడీ ఖజానాకు.. బంగారం

టీటీడీకి చెందిన 1,381 కిలోల బంగారంతో కూడిన పెట్టెలను.. చెన్నై నుంచి తిరుపతికి తరలిస్తుండగా పట్టుకున్న ఎన్నికల నిఘా బృందం పట్టుకున్న విషయం తెలిసిందే.
తమిళనాడులోని వేపంపట్టు చెక్‌పోస్టు నిఘా బృందం చేపట్టిన తనిఖీల్లో ఈ బంగారాన్ని అధికారులు గుర్తించారు. బంగారానికి సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో అధికారులు సీజ్ చేశారు.
గురువారం ఎన్నికల అధికారులకు బ్యాంక్ అధికారులు ఆధారాలు చూపించారు. టీటీడీ బంగారం విడుదలకు ఉన్నతస్థాయిలో అనుమతులు జారీ అయ్యాయి. స్థానిక అధికారులు అందుబాటులో లేని కారణంగా విడుదల ఆలస్యమైంది. నేడు(శుక్రవారం) ఖజానాకు జమచేస్తామని టీటీడీకి బ్యాంకు అధికారులు సమాచారమిచ్చారు.