ఆంధ్రప్రదేశ్

నేడు ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం

కడప: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవం గురువారం అట్టహాసంగా జరగనుంది. రాత్రి 8  నుంచి 10 గంటల మధ్య వివాహ వేడుకను కనులపండువగా నిర్వహించేందుకు తితిదే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు లక్ష మంది భక్తులు హాజరవుతారన్న అంచనాతో కల్యాణ వేదికను నిర్మించారు. కల్యాణోత్సవానికి గవర్నరు నరసింహన్‌, సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు.

షరతులతో చంద్రబాబుకు అనుమతి
దిల్లీ: కోదండరాముని కల్యాణంలో చంద్రబాబు పాల్గొనడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయకూడదని, అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని ఉపయోగించుకోకూడదని షరతు విధించింది.