ఆంధ్రప్రదేశ్

నా సర్వేలకు చింతిస్తున్నా: లగడపాటి

ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో తాను చెప్పిన ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు లెక్క తప్పాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలమైందనందుకు చింతిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. 2004 నుంచి అనేక రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ వచ్చానన్న ఆయన.. పక్షపాతం లేకుండా అనేక సందర్భాల్లో ప్రజలనాడి తెలిపామన్నారు. తన సర్వేల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే మన్నించాలని కోరారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని సూచించారు.