జాతీయంవ్యాపారం

నాలుగో రోజూ నష్టాలే..!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 9.33 సమయంలో సెన్సెక్స్‌ 211 పాయింట్లు పతనమై 37,577 వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు పతనమై 11,295 వద్ద ట్రేడవుతున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లు భారీ నష్టా్ల్లో కొనసాగుతున్నాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయంతో చమురు ధరలు పతనమయ్యాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌లో 69.71 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక రూపాయి విలువ కూడా పతనమైంది. నేటి ఉదయం రూ.69.88 వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది. నిన్న రూ.68.71 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది.
అంతర్జాతీయ మార్కెట్లు కూడా వాణిజ్య యుద్ధభయంతో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ ఐదువారాల అత్యల్పానికి చేరింది. కొరియా, ఆస్ట్రేలియా సూచీలు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి.