తెలంగాణ

నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో ఎన్నికలు

ఢిల్లీ: నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాంతో పాటే… తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. సీఈసీ రావత్‌ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ అయింది. ఈ సమావేశంలో సభ్యులు సునీల్‌ అరోరా, అశోక్‌ లావాస పాల్గొన్నారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన ఉమేష్‌ సిన్హా కమిటీ నివేదికపై చర్చించారు. వారం పది రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణకు రానుంది. ఆ తర్వాత ఎన్నికల తేదీలపై ఈసీ తుది కసరత్తు చేయనుంది. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. అక్టోబర్ రెండో వారంలో 5 రాష్ట్రాల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.