సినిమా

‘నాయే పేయే’ ప్రారంభం

కోడంబాక్కం: తని ఒరువన్‌, వళక్కు ఎన్‌, ఒరు కుప్ప కధై వంటి చిత్రాల ద్వారా ఎడిటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న గోపి కృష్ణన్‌ నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం ‘నాయే పేయే’. డాన్స్‌ మాస్టర్‌ ధినేష్‌ ఇందులో హీరోగా నటిస్తున్నారు. శక్తివాసన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే కథ, మాటలు సమకూర్చుతున్నారు. ఐశ్వర్య కథానాయిక. ఆడుగలం మురుగదాస్‌, షియాజి షిండే, రోకేష్‌, క్రిష్‌లు ఇతర తారాగణం. ఈ సినిమా పూజ కార్యక్రమం ఏవీఎం వినాయక స్వామి ఆలయంలో జరిగింది. దర్శకుడు పేరరసు, రాజేష్‌లతో పాటు 25 మంది దర్శకులు ముఖ్య అతిథులుగా విచ్చేసి తొలి సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు. ఇది కూడా హాస్యం కలిసిన హర్రర్‌ సినిమా. దెయ్యాన్ని కిడ్నాప్‌ చేసే కొత్త కాన్సెప్టుతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.