తెలంగాణ

నాగ చైతన్య, సాయి పల్లవి సినిమా ప్రారంభం

ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో.. నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది. సికింద్రాబాద్‌లోని వినాయకుడి ఆలయంలో గురువారం సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘ఫిదా’ సినిమాతో మంచి విజయం అందుకున్న శేఖర్‌ కమ్ముల .. తర్వాత ఎలాంటి కథతో వస్తారా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ‘ఫిదా’ సినిమాలో కథానాయికగా నటించిన సాయి పల్లవినే మళ్లీ తన సినిమాలో కథానాయికగా ఎంపిక చేసుకుని అంచనాలను పెంచేశారు. నారాయణదాస్‌ నారంగ్‌, రామ్మోహనరావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ మొదలైంది. సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. 2019 చివర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.