క్రైమ్సినిమా

నాకు ఆ క్రికెటర్‌పై క్రష్‌ ఉండేది: కాజల్‌

హైదరాబాద్‌: టీమిండియా వైస్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై తనకు క్రష్‌ ఉండేదని అంటున్నారు ప్రముఖ నటి కాజల్‌ అగర్వాల్‌. ఓ ఇంటర్వ్యూలో.. ‘మీకు ఏ స్పోర్ట్స్‌ పర్సన్‌ అంటే ఇష్టం?’ అని అడిగిన ప్రశ్నకు కాజల్‌ ఈ విధంగా సమాధానమిచ్చారు.
‘నాకు రోహిత్‌ శర్మ అంటే ఒకప్పుడు క్రష్‌ ఉండేది. మైదానంలో అతని ఆటతీరు చూసి ఎంతో సంబరపడిపోయేదాన్ని. రోహిత్‌ బ్యాటింగ్‌ స్కిల్స్‌ అంటే నాకు చాలా ఇష్టం’ అని తెలిపారు. తన ఆటతీరుతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హిట్‌మ్యాన్‌ ఈరోజు తన 32వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు.
మరోపక్క వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు కాజల్‌. ‘భారతీయుడు 2’లో కమల్‌ హాసన్‌కు జోడీగా నటిస్తున్నారు. దీంతో పాటు ‘పారిస్‌ పారిస్‌’, ‘కోమలి’ అనే తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో కాజల్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌ జంటగా నటించిన ‘సీత’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. శర్వానంద్‌కు జోడీగా ఓ సినిమాలో నటిస్తున్నారు.