Uncategorized

నాంపల్లిలో దారుణ హత్య

  • నాంపల్లిలో దారుణ హత్య
    ఘటనా స్థలంలో గంజాయి, సిగరెట్లు స్వాధీనం
    వరుస హత్యలతో బెంబేలెత్తుతున్న నగర వాసులు
    వరుస హత్యలు, హత్యాయత్నాలతో హైదరాబాదు నగరం నెత్తురోడుతోంది. ఈ హత్యలతో నగర ప్రజలు భీతిల్లుతున్నారు. తాజాగా నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. నాంపల్లిలో ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు సమీపంలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనా స్థలంతో గంజాయి, సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. యువకుల మధ్య ఘర్షణే హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు… దర్యాప్తును ప్రారంభించారు.