జాతీయం

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.41గంటల సమయంలో సెన్సెక్స్‌ 55 పాయింట్లు నష్టపోయి 37,407 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 11,248 వద్ద  ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.15 వద్ద కొనసాగుతోంది.

వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌, ఒబెరాయ్‌ రియాల్టీ, పీసీ జ్యువెల్లర్స్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫినాన్స్‌, టాటా స్టీల్స్‌, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా.. టీసీఎస్‌, ఎస్‌బీఐ, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ రంగాల షేర్లు మినహా మిగిలిన రంగాల షేర్లన్నీ నష్టాలను చవి చూస్తున్నాయి.