అంతర్జాతీయం

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి 222 పాయింట్లు నష్టపోయి 38,164 వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 11,462 వద్ద ముగిశాయి.  భారీ కంపెనీల షేర్లు నష్టపోవడం నేటి మార్కెట్‌ను కుంగదీసింది. రిలయన్స్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, కొటాక్‌ బ్యాంక్‌, మారుతీ షేర్లు కుంగాయి. నిఫ్టీ ప్రధాన సూచీతో పాటు, స్థిరాస్తి రంగ సూచీ కూడా బాగా నష్టపోయింది. శుక్రవారం ఫిచ్‌ సంస్థ భారత్‌ రేటింగ్‌ను తగ్గించి 6.8గా ప్రకటించింది.
నేటి మార్కెట్లో ఇండిగో నేషన్‌ మాతృసంస్థ ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ షేర్లు, స్పైస్‌ జెట్‌ షేర్లు భారీగా లబ్ధిపొందాయి. లార్సన్‌ అండ్‌ టుబ్రో షేర్లు కూడా దాదాపు 3శాతం పెరిగాయి.