క్రైమ్తెలంగాణ

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పట్టపగలే దారుణ హత్య

నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది మిర్యాలగూడలో స్థానిక జ్యోతీ ఆసుపత్రి వద్ద పట్టపగలే దారుణ హత్య జరిగింది. మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ళు ప్రణయ్ అనే యువకుడిపై ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేయగా..ప్రణయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ యువకుడు మిర్యాలగూడకే చెందిన ఓ ప్రముఖ బిల్డర్ కుమార్తె అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, ఆమె గర్భం దాల్చడంతో ఈ ఆసుపత్రికి తీసుకువచ్చి తిరిగి వెళ్తుండగా ..వెనుకనుంచి వచ్చిన ఓ వ్యక్తి అతనిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.