ఆంధ్రప్రదేశ్క్రైమ్

దేవాలయంలో ప్రమాణం చేసిన టీడీపీ నేత..

కర్నూలు: పత్తికొండ వైసీపీ నాయకురాలు శ్రీదేవిపై టీడీపీ అభ్యర్థి శ్యాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆదివారం జిల్లాలోని వెల్దుర్తి మండలం రామలకోట గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రచ్చబండపై కూర్చున్న శ్యాంబాబు.. నారాయణ రెడ్డి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆయనను చంపింది తాను కాదని ప్రమాణం చేశారు. తాను చేసిన విధంగానే రచ్చబండ మీద కూర్చొని వైసీపీ అభ్యర్థి శ్రీదేవి ప్రమాణం చేయగలరా? అని ప్రశ్నించారు. ఓవైపు తండ్రి పార్థీవదేహం ఉన్నా.. జగన్మోహన్ రెడ్డి అదేమీ పట్టించుకోకుండా పదవీకాంక్షతో సీఎం కుర్చీ తనకు కావాలని ఎమ్మెల్యేలను కలిశారని విమర్శించారు. ఇదే మాదిరిగా శ్రీదేవి కూడా వ్యవహరించారని విమర్శించారు. ఆమె భర్త చనిపోయి ఆరు నెలలు గడవకముందే.. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని, తనను గెలిపించండని అన్నారని శ్యాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.