అంతర్జాతీయం

దూకుడుగా ఎల్‌అండ్‌టీ షేరు

ముంబయి: నేటి మార్కెట్లో ఇంజినీరింగ్‌ రంగ దిగ్గజం ఎల్‌అండ్‌టీ షేరు దూకుడుగా ఉంది. ఇప్పటికే మైండ్‌ట్రీలో 20శాతం వాటాలను కొనుగోలు చేయడంతో ఈ షేరుకు డిమాండ్‌ పెరిగింది. నేటి మార్కెట్లో ఎల్‌అండ్‌టీ షేరు బాగా పెరిగి రూ.1,415కు చేరింది. బ్రోకరేజి సంస్థలు దీనికి ‘బై’ రేటింగ్‌ ఇవ్వడంతో కొనుగోళ్లు జోరుగా జరుగుతున్నాయి. మరో 3శాతం పెరిగితే 52వారాల గరిష్ఠానికి చేరుకుంటుంది.
ఈ వారం ఎల్‌అండ్‌టీ సంస్థ మైండ్‌ట్రీను వశం చేసుకోవడానికి 20.32శాతానికి షేర్లను కొనుగోలు చేసింది. తాజాగా మైండ్‌ట్రీలో తన వాటాలను 66.32శాతానికి పెంచుకోవడానికి వ్యూహం సిద్ధం చేసుకొంది. ఈ డీల్‌ విలువ రూ.10,730 కోట్లు. ఈ కొనుగోలుతో మైండ్‌ట్రీ సంస్థ,  తమ సంస్థ వాటాదార్లు లబ్ధిపొందుతారని ఎల్‌అండ్‌టీ పేర్కొంది.