జాతీయం

దిల్లీలో కేంద్ర కేబినెట్‌ భేటీ

దిల్లీలో కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. పార్లమెంట్‌ హౌస్‌లోని లైబ్రరీ హాలులో మోదీ అధ్యక్షతన ప్రారంభమైన ఈ భేటీలో 16వ లోక్‌సభ రద్దుకు సంబంధించిన తీర్మానం చేయనున్నారు. కేబినెట్‌ రద్దుపై తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపనున్నారు. ఈ భేటీ తర్వాత ప్రధాని మోదీ మంత్రిమండలితో సమావేశమవుతారు. మరోవైపు, రేపు హస్తినకు రావాలని ఎంపీలను భాజపా నాయకత్వం ఆదేశించింది. ఈ నెల 26న భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ అయ్యే అవకాశం కనబడుతోంది.