తెలంగాణ

త్రివిధ ద‌ళాలు మోదీ సొంత ఆస్తులు కాదు..

హైద‌రాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీలు.. ప్ర‌ధాని మోదీ స్వంత ఆస్తులు కావన్నారు. త్రివిధ‌ద‌ళాలను ప్ర‌ధాని త‌న వ్య‌క్తిగ‌త ఆస్తులుగా భావిస్తున్నార‌ని రాహుల్ విమ‌ర్శించారు. యూపీఏ పాల‌న స‌మ‌యంలో స‌ర్జిక‌ల్ దాడులు చేశామంటే, అవి వీడియోగేమ్‌లో జ‌రిగాయ‌ని మోదీ ఆర్మీని కించ‌ప‌రిచార‌ని రాహుల్ అన్నారు. నిరుద్యోగం ఇప్పుడు అతిపెద్ద స‌మ‌స్య‌గా మారింద‌న్నారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీయ‌డం వ‌ల్లే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌న్నారు, అవి ఏమైన‌వ‌ని రాహుల్ ప్ర‌శ్నించారు. ఉద్యోగుల గురించి కానీ, రైతుల గురించి కానీ మోదీ ఏమీ మాట్లాడ‌డం లేద‌న్నారు. చౌకీదార్ చోర్‌హై అన్న వ్యాఖ్య‌ల ప‌ట్ల సుప్రీంకోర్టుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ట్లు రాహుల్ అంగీక‌రించారు. కానీ ఆ వ్యాఖ్య‌ల ప‌ట్ల బీజేపీకి మాత్రం క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌బోన‌న్నారు. చౌకీదార్ చోర్ హై అన్న‌ది మా నినాదంగా ప‌నిచేస్తుంద‌న్నారు. మ‌సూద్ అజ‌ర్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, కానీ అత‌న్ని ఎవ‌రు విడిచి పెట్టార‌ని రాహుల్ ప్ర‌శ్నించారు.