తెలంగాణ

తెలంగాణ ఎన్నికలు నవంబర్ 24న ?

తెలంగాణా అసెంబ్లీకి ఎన్నికలను నవంబర్ 21-26 తేదీల మధ్య నిర్వహించే అవకాశాలను ఎన్నికల సంఘం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బహుశా నవంబర్ 24 వ తేదీని ఈసీ ఖరారు చేయవచ్చునని వార్తలు వస్తున్నాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు, లక్షలాది ఓటర్ల పేర్లు గల్లంతువంటి వాటిపై వివిధ రాజకీయపార్టీలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో .. ఈ జాబితాలను ఆడిట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఈసీ పంపవచ్చునని అంటున్నారు. ఆడిటింగ్‌తో బాటు ఈ బృందాలు తెలంగాణాలో పోలింగ్ కేంద్రాలు, ఈవీఎం‌ల స్టోరేజీ, ఎన్నికల యంత్రాంగం లాంటి వాటిని అధ్యయనం చేయనున్నాయి. ఓటర్ల తుది జాబితా విడుదలయ్యాక.. అక్టోబరు 8న ఈ టీములు ఆడిటింగ్ మొదలుపెడతాయని సమాచారం. నవంబర్ 24న ఎలక్షన్స్ జరగనున్నాయని, ఆ ప్రకారం మీ ప్రచారం షెడ్యూలు చేసుకోవాలని తెరాస నాయకత్వం తమ అభ్యర్థులకు సూచించినట్టు తెలుస్తోంది.