తెలంగాణ

తెలంగాణలో 5 స్థానాల్లో బిజెపి ఆధిక్యం

తెలంగాణలో కమలం పార్టీ ప్రభావం చూపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న కమలనాథులు లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపుతున్నారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉండగా..ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి ఐదు స్థానాల్లో ఆపార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఉదయం 11గంటలకు వెలువడిన ఫలితాల్లో సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి 15వేల ఓట్ల ఆధిక్యంలో, నిజామాబాద్‌ నుంచి ధర్మపురి అరవింద్‌  18వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హైదరాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌లోనూ బిజెపి అభ్యర్థులు ముందజంలో కొనసాగుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ 10 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ పార్టీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. నల్గొండ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు.