Uncategorized

తెరాస ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు అభివృద్ధికి అండగా నిలుస్తుంది

శేరిలింగంపల్లి, ప్రజాపాలన : హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని నూతనంగా ఏర్పాటు చేసిన నాయి బ్రాహ్మణ సేవ సంఘం (హఫీజ్ పెట్) కార్యాలయాన్ని కార్పోరేటర్  జగదీశ్వర్ గౌడ్ ముఖ్యఅతిధిగా విచ్చేసి ప్రారంభించారు. నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లింగం నాయి, హఫీజ్ పెట్ తెరాస నాయకులు బల్లింగ్ గౌతమ్ గౌడ్ తో కలిసి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ, వారి అభివృద్ధికి కృషి చేస్తామని, నాయి బ్రాహ్మణ కుటుంబలకు ప్రతి విషయంలో తోడుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు కె.వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ నాయి, సురేష్ నాయి తదితరులు పాల్గొన్నారు.