ఆధ్యాత్మికం

‘తెదేపాకు వేస్తే వైకాపాకు’.. ఈసీకి బాబు లేఖ

అమరావతి: ఈవీఎంలు పనిచేయకపోవడంపై సీఎం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పోలింగ్ ప్రారంభించి 3 గంటలైనా 30 శాతం ఈవీఎంలు పనిచేయక పోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈవీంఎంల పనితీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు ఆందోళన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశానికి వేసే ఓటు వైకాపాకి వెళ్తోందని ఫిర్యాదులు వస్తున్నాయని, ఇది చాలా దురదృష్టకర పరిణామమన్నారు. అనేక ప్రాంతాల నుంచి ఈవీఎంలు పని చేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, పోలింగ్‌ ఆలస్యమైన చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎన్నికల సంఘం దీనిపై హుటాహుటిన స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు సీఎం పిలుపు మేరకు ఈవీఎంలు పనిచేయని చోట్ల ఆందోళనలు చేపట్టేందుకు తెదేపా నేతలు సిద్ధమవుతున్నారు.