తెలంగాణ

తిరిగి కాంగ్రెస్ లో చేరిన కొండా దంపతులు..

వరంగల్‌ తూర్పు నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ కొండా దంపతులు తిరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఉదయం ఢిల్లీలో రాహుల్‌ గాంధీ సమక్షంలో కొండా మురళి, సురేఖ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో దొరల పాలన సాగుతోందని, ఉద్యమంలో పాల్గొన్న వారికి సరైన ప్రాధాన్యం లభించలేదని సురేఖ ఆరోపించారు. బీసీ మహిళ అయిన తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోయినా పార్టీకి సేవ చేశానని.. అయినా తనకు ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు మంత్రివర్గంలో చోటు కల్పించకుండా నమ్మక ద్రోహం చేశారని, ఒక్క మహిళామంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్‌కు మహిళలపై ఉన్న గౌరవం ఏమిటో తెలుస్తోందన్నారు. కేసీఆర్‌కు 10పేజీల లేఖను విడుదల చేశారు. తాను, తన భర్త ఎమ్మెల్సీ కొండా మురళి తెరాసకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొండా దంపతులు తమకు మూడు స్థానాలు కేటాయించాలని కోరుతున్నా.. మహాకూటమి సర్దుబాటు దృష్ట్యా అన్ని సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.