జాతీయం

తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోదీ

అహ్మదాబాద్‌: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మంగళవారం ప్రారంభమైన మూడో దశ ఎన్నికల పోలింగ్‌కు ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ ద్వారా ప్రజలకు సందేశమిచ్చారు. ‘‘మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఓటు వేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో పోలింగ్‌ బూత్‌లకు తరలిరావాలని కోరుతున్నాను. మీ ఓటు చాలా విలువైనది. దేశ భవిష్యత్తును  మీ ఓటే నిర్ణయించబోతోంది. మరికాసేపట్లో నేను అహ్మదాబాద్‌లో నా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాను’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

మూడో దశలో భాగంగా గుజరాత్‌లోని 26 లోక్‌సభ స్థానాలకు ఈరోజే ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ తన ఓటు హక్కును అహ్మదాబాద్‌లోని రనిప్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఆయన గాంధీనగర్‌లోని తన తల్లి నివాసానికి చేరుకొని ఆశీర్వాదం తీసుకున్నారు.