సినిమా

తన పాటను తానే పాడుకున్న హీరో..

మన హీరోలు డ్యాన్సులు, ఫైట్లు చేయడమే కాదు అప్పుడప్పుడు గాయకులుగా కూడ మారిపోతుంటారు.  ఇప్పటీకే ఎన్టీఆర్, అఖిల్, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు పాటలు పాడగా ఇప్పుడు హీరో రామ్ కూడ వీరి జాబితాలోకి చేరిపోయాడు.

ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రంలోని ఒక పాటను రామ్ చేత పాడించాడట సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.  ముందుగా రామ్ పాడటానికి ఒప్పుకోకపోయినా దేవి శ్రీ బలవంతం మీద ఒప్పించి పాడించేశాడట.  త్రినాథ్ రావ్ నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 18న రిలీజ్ కానుంది.