క్రైమ్జాతీయం

ఢిల్లీ పోలీసు అధికారి కొడుకు వికృత చేష్టలు

దారుణం.. యువతి పట్ల వికృత చేష్టలకు దిగారు ఓ యువకుడు. ఆమెపై దాడిచేసి, ఆ దారుణాన్ని షూట్ చేసిన వీడియోతో మరో యువతిని బెదిరించాడు. ఈ ఘటనకు పాల్పడింది ఎవడోకాదు సాక్షాత్తూ ఢిల్లీలో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్స్‌పెక్టరుగా పనిచేస్తున్న అశోక్‌‌కుమార్‌ తోమర్‌ కొడుకు రోహిత్‌ సింగ్‌. ఇతగాడ్ని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.

ఆ యువతిని జుట్టు పట్టుకుని నేలపై పడేసి ఈడుస్తూ కాళ్లతో పొట్టలో తన్నిన ఘటన ఈనెల రెండున ఢిల్లీలోని తిలక్‌నగర్‌‌లో జరిగింది. ఈ తతంగాన్ని షూట్ చేశాడు మరో యువకుడు. ఈ వీడియో చూపించి తనను భయభ్రాంతులకు గురి చేశాడంటూ రోహిత్‌ సన్నిహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి పైశాచికత్వం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు బాధితులు కలిసి దుర్మార్గుడైన రోహిత్‌‌సింగ్‌ తోమర్‌ అరెస్టుని చేయించారు. రోహిత్‌.. తనను ఓ ఫ్రెండ్ కార్యాలయానికి పిలిపించి అక్కడ అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది.